
యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వం జారీచేసిన జీవోపై అభ్యంతరాలొస్తున్నాయి. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పీహెచ్‌డీ అభ్యర్థులకు 30 మార్కులు కేటాయించాలని యూజీసీ స్పష్టంచేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోలో పీహెచ్‌డీ ఉంటే 10 మార్కులు కేటాయిస్తామని పేర్కొన్నారు. దీంతో పీహెచ్‌డీ అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆరోపిస్తున్నారు. జీవోతో 20 మార్కులు కోల్పోవాల్సి ఉంటుందని పీహెచ్‌డీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.