ముస్లింల పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని దుబాయ్‌లో 1856 మంది ఖైదీలను విడుదల చేస్తూ దుబాయ్ రాజు షేఖ్ మొహమ్మద్ బిన్ రాషేద్ ఆదేశాలు జారీ చేశారు. అబుదాబిలో 1440 మంది ఖైదీలను, షార్జాలో 738 మంది, రాస్ అల్ ఖైమాలో 407 మంది, ఫుజిరాలో 125 మంది ఆజ్మాన్‌లో 135 మంది ఖైదీలను విడుదల చేస్తూ పాలకులు హుకుం జారీ చేశారు. సౌదీ అరేబియా, ఖతర్, ఒమాన్ దేశాలు కూడా పెద్ద సంఖ్యలో ఖైదీలను విడుదల చేశాయి.

