భారత ఉపరాష్ట్రపతి సీ.పి. రాధాకృష్ణన్ పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (SSSIHL) 43వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు సత్యసాయిబాబా సమాజ సేవ కోసం నాయకులను తయారు చేశారన్నారు. నైతిక విలువలు, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం నేర్పే కేంద్రంగా ఈ సంస్థ విలసిల్లుతోందని ప్రశంసించారు. యువత దేశ నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సంస్థలో 1,500 మంది విద్యార్థులు డిగ్రీలు పొందారు. ఈ సంస్థ అందించే ఉచిత విద్యా విధానం ప్రపంచవ్యాప్తంగా మార్గదర్శకంగా నిలుస్తోందని రాధాకృష్ణన్ కొనియాడారు.

