
అరేబియా మహాసముద్రం వేదికగా భారత్ , పాకిస్థాన్ మధ్య శుక్రవారం తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారతదేశపు అత్యంత కీలకమైన ఎకనామిక్ జోన్ (ఇఇజడ్) సముద్ర జలాల్లో పెద్ద ఎత్తు న విన్యాసాలు సాగించారు. ఇటీవలి కాలంలో భారతీయ నౌకాదళం విశేషరీతిలో తమ పోరాట పటిమను పెంచుకునేలా ఆయుధాలను, అత్యంత అధునాతన నౌకలను వార్‌హెడ్స్‌ను, జలాంతర్గాములను, విమానాలను సంతరించుకుంది. ప్రత్యేకించి గుజరాత్ తీర ప్రాంతానికి సమీపంలో భారతీయ తీరప్రాంత దళాలు సర్వం సమాయత్తం అయ్యాయి. ముఖ్యంగా ఫార్వర్డ్ ఏరియాలలో నిఘా పెంచారు.