యాసిడ్ దాడి బాధితుల జీవితాలను గౌరవంగా నిలబెట్టేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలంటూ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ప్రతి బాధితుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యంకాకపోతే, వారి జీవనాధారం కోసం ప్రత్యేక భత్యం అందించే విధానం రూపొందించాలని కోర్టు ఆదేశించింది.ఇలాంటి దారుణాలకు పాల్పడే నేరగాళ్లకు మరింత కఠినమైన శిక్షలు విధించేలా చట్టాలను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

