
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వరకు ఎంఎంటీఎస్ ట్రైన్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్ నుంచి ఘట్‌కేసర్ వరకూ ఎంఎంటీఎస్ రెండో దశ కింద 21కిలోమీటర్ల రైల్వే లైను పూర్తి అయ్యింది. ఘట్కేసర్-యాదాద్రి మధ్య 33 కి.మీల మేర మూడో రైల్వేలైన్ నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయని, జూన్ లో ప్రాథమిక పనులు ప్రారంభం కానున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.