బీఆర్ఎస్ అధినేత, మాజీసీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రికి రావడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఫాం హౌస్ నుంచి నేరుగా నందినగర్‌లోని ఇంటికి కేసీఆర్ వచ్చారు. నందినగర్ నివాసంలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే మరిన్ని మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం కేసీఆర్‌ను వైద్యులు సోమాజీగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. సోమాజీగూడ యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో కేసీఆర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఆరోగ్య పరీక్షల పూర్తి అయిన తర్వాత కేసీఆర్ నందినగర్‌లోని నివాసానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

