రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మోయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేసింది. రిమాండ్‌లో ఉన్న నిందితులను విచారించడం, డ్రగ్స్ పార్టీపై లోతుగా విచారణను జరపడం కోసం తొమ్మది మంది అధికారులకు బాధ్యతలు అప్పగించింది. సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఈ కేసును దర్యాప్తు చేయనుంది.సిట్ చీఫ్‌గా చీఫ్‌గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ వ్యవహరించనున్నారు.

