
కుంభమేళాలో పూసలు అమ్ముకొని దేశం దృష్టిని ఆకర్షించిన నీలి కళ్ల సుందరి మోనాలిసా కు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పిన డైరెక్టర్ సనోజ్ మిశ్రాను 28 ఏళ్ల మహిళ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే సినిమా ఆఫర్ ఆశ చూపించి ముంబాయిలో ఆమెతో సహజీవనం చేసినట్టు . పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది. తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని.. సనోజ్ అమాయకుడని సదరు యువతి తెలిపింది. అతడిని కావాలనే కొందరు ఇలా ఇరికిస్తున్నారని చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది.