
ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్న వేళ, భారత్-అమెరికా బంధం కొత్త శిఖరాలకు చేరుకుంటోంది. నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా, అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. భారత్-అమెరికా మధ్య ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలు తుది అంకానికి చేరుకున్నాయి. ఇరు దేశాలకూ లాభదాయకమైన (“విన్-విన్”) ఈ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేయాలని ఇరు పక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి.