ప్రతి నెల ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఈసారి జల సంరక్షణపై ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణలోని ముదిగుంట గ్రామ ప్రజలు ఐక్యంగా పనిచేసి నీటి సమస్యను ఎలా అధిగమించారో ప్రధాని ప్రత్యేకంగా వివరించారు. దాదాపు 400 కుటుంబాలు కలిసి ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని భూమిలోకి చొప్పించడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకున్నారని ప్రశంసించారు.

