
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పెయిటోంగ్‌టార్న్ షిన్‌వత్రా ఆయనకు “ది వరల్డ్ త్రిపీటిక : సజ్జయ పొనెటిక్ ఎడిషన్” అనే త్రిపిటకాన్ని బహుమతిగా ఇచ్చారు. మోదీకి థాయ్‌లాండ్ ప్రధానమంత్రి ఇచ్చిన బహుమతి త్రిపిటక (పాలీలో) లేదా త్రిపిటకం (సంస్కృతంలో) అనేది బుద్ధుని బోధనల యొక్క ప్రసిద్ధ సమాహారం. ఇందులో 108 సంపుటాలు ఉన్నాయి. ఇది ప్రధాన బౌద్ధ గ్రంథంగా పరిగణించబడుతుంది.