 
		మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం హనుమకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తున్నారు. సమ్మయ్యనగర్లో వరద ప్రాంతాలను, దెబ్బతిన్న నాలాలను ఆయన పరిశీలించారు. సర్వం కోల్పోయిన బాధితులను సీఎం పరామర్శించి, వారికి భరోసా ఇవ్వనున్నారు. బాధితులను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు ఉన్నారు.
 
      
 
								 
								