మొంథా తుపాను ప్రభావం పిఠాపురం నియోజకవర్గంపై తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో సర్వ సన్నద్ధతతో ఏర్పాట్లు చేశారు. కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ కాకినాడ జిల్లాలో ఉన్న తుపాను ప్రభావ పరిస్థితులను ఉప ముఖ్యమంత్రి సమీక్షిస్తూ ఉన్నారు. .గంట గంటకు నివేదికలు తీసుకుంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

