
మైక్రోసాఫ్ట్ 50వ వార్షికోత్సవం సందర్బంగా మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల; మాజీ CEOలు స్టీవ్ బాల్మర్, బిల్ గేట్స్ వేదికపై కంపెనీ గురించి మాట్లాడుతుండగా.. భారతీయ అమెరికన్ వానియా అగర్వాల్ గట్టిగా నినాదాలు చేశారు. ‘మీ అందరికీ సిగ్గుండాలి.. మీరంతా కపట వ్యక్తులు.. మైక్రోసాఫ్ట్ టెక్నాలజీతో గాజాలో 50,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు తీశారు.. మీకు ఎంత ధైర్యం. వారి రక్తంతో వేడుకలు చేసుకుంటున్నందుకు మీ అందరికీ సిగ్గుండాలి.. ఇజ్రాయేల్‌తో సంబంధాలు తెంచుకోండి’ వానియా గట్టిగా కేకలు వేస్తూ విరుచుకుపడ్డారు. అయితే, అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఆమెను బయటకు తీసుకెళ్లారు.