
సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో పెట్టిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంత్రివర్గ సమావేశంలో.. ప్రైవేటు పరం చేయడం అవినీతికి నిదర్శమని కాలేజీలు రావడంతో.. ఆ ప్రాంతంలో అమాంతంగా విలువ పెరిగిన ఆ కాలేజీల భవనాలు, భూములు కొట్టేయడానికి చంద్రబాబు ఇలా ప్లాన్ చేశారంటూ వైఎస్ జగన్ ఆరోపించారు. పేదలకు ద్రోహం చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయన్న వైఎస్ జగన్.. తాము అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తామని ప్రకటించారు.