ఈ ఏడాది జరగనున్న మేడారం మహా జాతరకు 3,495 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టుగా టీజీఎస్‌ఆర్టీసీ తెలిపింది. అవసరమైతే మరిన్ని బస్సులు నడిపేందుకు సిద్దంగా ఉన్నట్టుగా పేర్కొంది. అయితే ఈ బస్సుల్లో 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్టు వెల్లడించింది. అయితే ఈ స్పెషల్ బస్సుల్లో (ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్) కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.

