జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది. ఈ మహాజాతరకు సర్కార్ పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికలను అధికారికంగా అందజేశారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను సర్కార్ ఆహ్వానించింది. గురువారం మంత్రులు సీతక్క, కొండా సురేఖలు.. ఎర్రవల్లిలోని కెసిఆర్ నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు. మేడారం జాతరకు రావాలని మంత్రులు స్వయంగా ఆహ్వానం పత్రిక అందజేశారు.

