ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుంచి మేడారం వరకు వెళ్లి తిరిగి రావడానికి రౌండ్-ట్రిప్ హెలికాప్టర్ రైడ్ కోసం రూ.35,999 ఛార్జీ చేయనున్నారు. ఇక, మేడారం పరిసరాల్లో విహంగ వీక్షణం చేయాలని అనుకుంటే రూ. 4,800 చెల్లించాల్సి ఉంటుంది. ఏడు నిమిషాల పాటు మేడారం పరిసరాల్లో హెలికాప్టర్ రైడ్ ఆస్వాదించవచ్చు. .

