మీరు చదివింది నిజమే.. మెస్సీ పాదాల విలువ 1 బిలియన్ డాలర్.. అక్షరాలా 9వేల కోట్లు. అందులో ఎడమపాదానికే 7వేల కోట్ల ఇన్సూరెన్స్ ఉందని అంచనా. మెస్సీ కాళ్లు సాధారణ కాళ్లు కావు. అంతర్జాతీయ స్పోర్ట్స్ ఇన్సూరెన్స్ అంచనాల ప్రకారం, అతని కెరీర్‌లో వివిధ దశల్లో మెస్సీ కాళ్లకు సుమారు 700 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు ఇన్సూరెన్స్ ఉందని అంచనా. ఈ సంఖ్యలు అధికారికంగా బయటకు రావు. కానీ విలువ ఎంత భారీదో చెప్పడానికి ఇవే చాలు.

