అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి గోట్ టూర్ ఆఫ్ ఇండియా ప్రారంభమైంది. కోల్‌కతాలో శనివారం ఉదయం లేక్‌టౌన్‌లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్‌తో కలిసి మెస్సి వర్చువల్‌గా ఆవిష్కరించాడు. భద్రతా కారణాల రీత్యా అక్కడికి వెళ్లలేదు. తెల్లవారుజామున కోల్‌కతాకు చేరుకున్న మెస్సి వెంట ఇంటర్ మియామీ జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ కూడా ఉన్నారు. 14ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన మెస్సిని చూడటానికి అభిమానులు వందల సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు.

