
కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తున్న విద్యార్థినీలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. నెల రోజుల నుంచి ఈ వేధింపులు జరుగుతున్నప్పటికీ ఎనిమిదవ తేదీన తమకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు అందిందని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. నలుగురు ఆరోపిత సిబ్బంది వి. కళ్యాణ్ చక్రవర్తి, ఎస్. గోపాలకృష్ణ, బి. జిమ్మీ రాజు, కె.వి.వి.ఎస్. ప్రసాద రావు సస్పెండ్ చేస్తూ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.