నిబంధనలకు విరుద్ధంగా హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ విక్రయిస్తున్న పలు మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. కొడైన్ కలిగి ఉన్న దగ్గుమందు, నైట్రావె ట్, అల్ఫ్రాజోలం, ట్రమడోల్, జోల్పిడెమ్, టైడల్ మాత్రలు, మెఫెన్‌టర్మైన్, అట్రాక్యూరియమ్ బెసిలెట్ ఇంజెక్షన్లను విచ్ఛలవిడిగా అమ్ముతున్నట్టు డీసీఏ అధికారులు ఈ సోదా ల్లో గుర్తించారు. 63 మెడికల్ షాపులకు నోటీసులు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.

