మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికుల లగేజీ కష్టాలను తీర్చేందుకు టక్కీట్ అనే సంస్థతో కలిసి పనిచేయనుంది. తొలివిడతలో కేవలం ఏడు మెట్రో స్టేషన్లలో ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. మెట్రోలో ప్రయాణించే వారి వద్ద హెల్మెట్లు, బ్యాగులు, ఇతర షాపింగ్ సంచులు వంటివి ఉండడం సహజం. లగేజీని స్టేషన్లలోనే లాకర్లో సేఫ్ గా పెట్టుకునే ఏర్పాట్లు చేయనున్నారు. లాకర్ ఎంత టైం యూజ్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకుని డిజిటల్ పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నారు.

