
హైదరాబాద్ మెట్రో ఎండీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. కాగా.. బెట్టింగ్ యాప్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఈ మేరకు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ యాడ్లను ప్రమోట్ చేసిన వారికి నోటీసులు పంపించి పోలీసులు విచారించారు.