
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ మెగా 157 ఉగాది నాడు లాంఛనంగా ప్రారంభమైంది. రామా నాయుడు స్టూడియోలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈవెంట్‌కు అల్లు అరవింద్, దర్శకేంద్రులు రాఘవేంద్రరావు, బాబీ, వంశీ పైడిపల్లి, శ్రీకాంత్ ఓదెల వచ్చారు. ఇక వెంకీ మామ ప్రత్యేక అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.