
లండన్ పర్యటనకు వస్తున్న చిరంజీవిని కలిసేందుకు.. అభిమానులతో చిరంజీవి సమావేశమవుతారని.. ఫ్యాన్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఫ్యాన్ మీటింగ్ పేరుతో కొందరు డబ్బులు వసూళ్లు చేశారనే అంశం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి పనిని నేను అంగీకరించను. దీనిని ఖండిస్తున్నా’ అని చిరంజీవి ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘అభిమానుల సమావేశం పేరిట డబ్బులు వసూళ్లు చేసిన వారు వెంటనే తిరిగి ఇచ్చేయండి’ అని మెగాస్టార్ ఆదేశించారు.