జెన్ జెడ్ ఉద్యమం ఉత్తర అమెరికాను తాకింది. తాజాగా మెక్సికోలో వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చిన నిసనలు చేశారు. దేశ అధ్యక్షురాలు క్లాడియా షిన్‌బామ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ ప్యాలెస్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను ముసుగులు ధరించిన కొందరు నిరసనకారులు కూల్చేశారు.అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిరసనకారులపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. కాగా, ఈ ఘర్షణల్లో 100 మంది పోలీసులకు గాయాలయ్యాయని సిటీ సిటిజెన్ సేఫ్టీ సెక్రటరీ పాబ్లో వాజ్‌క్వెజ్ చెప్పారు.

