దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల పుణ్య క్షేత్రంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మహిళలను రహస్యంగా పూడ్చిపెట్టిన ఘటనలో పారిశుద్ధ్య కార్మికుడు మాత్రమే కాదు.. మరో ఆరుగురు వ్యక్తులు మహిళల మృతదేహాలను ఖననం చేసినట్లు ముందుకు వచ్చారు. కొత్తగా వచ్చిన ఈ ఆరుగురు కూడా మృతదేహాలను ఖననం చేసిన ప్లేస్‌లో తవ్వకాలు చేపడితే ఆధారాలు దొరికే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా కంప్లైంట్ ఇవ్వకుండా ఇన్ని రోజులు వీరు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

