సరికొత్త ’జనాభా నిర్వహణ విధానం’ ముసాయిదాను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అసెంబ్లీలో ఆవిష్కరించారు. ఇందులో భాగంగా మూడో బిడ్డను కనే దంపతులకు రూ. 25 వేల ప్రోత్సాహకం అందించాలని ప్రభు త్వం ప్రతిపాదించింది. మూడో బిడ్డకు ఐదేళ్ల వయసు వచ్చేవరకు నెలకు రూ. 1,000 చొప్పున పౌష్టికాహార సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్యను అందించనున్నట్లు తెలిపారు. తల్లికి 12 నెలలు, తండ్రికి 2 నెలల పాటు సెలవులు మంజూరు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు.

