
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన మొదటి పాలన లో కొన్ని వ్యూహాత్మక పొరపాట్లు జరిగాయని ఆయన అంగీకరించారు. అయితే, ఈసారి (జగన్ 2.0) మరింత దృఢంగా, కార్యకర్తలకు మద్దతుగా నిలిచే విధంగా తన శైలిని మారుస్తానని చెప్పారు.అధికారం తిరిగి వచ్చాక పార్టీ శ్రేణులకు మరింత దగ్గరగా ఉంటానని, వారిని గౌరవిస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదని, తంలోలా ఇప్పటికీ అవినీతి, రాజకీయ వ్యూహాలతోనే పనిచేస్తున్నారని జగన్ విమర్శించారు.