
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది దేశాన్ని ఎక్కడ నొక్కాలే అక్కడే నొక్కుతుంది భారత్. ఈ చర్యల్లో భాగంగా పాకిస్థాన్ ను ఎండగట్టే చర్యల్లో సింధు నది తర్వాత మరో డ్యాములను క్లోజ్ చేసింది. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఈ డ్యామ్ స్లూయిస్ స్పిల్‌వేపై ఉన్న గేట్లను కిందకు దించేశారు. దీంతో పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు ఇక్కడ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ చర్యతో అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని రుజువు అయింది.