జీహెచ్ఎంసీ లో‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్’కు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ ఫైల్ ప్రభుత్వానికి చేరడంతో దీనిపై కాసేపట్లో గెలిట్ విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను విస్తరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్)కి లోపల, బయట, దానిని ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. తెలంగాణ మున్సిపాలిటీల చట్టాలకు అవసరమైన సవరణలు చేయాలని తీర్మానించింది.

