సరదాగా ఈత కొడదామని వెళ్ళిన ముగ్గురు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన గండిపేట మండలం పరిధిలో తీవ్ర కలకలం రేపింది. ఇబ్రహీంబాగ్ ప్రాంతానికి చెందిన గోవర్ధన్ (26) గోవర్ధన్ తమ్ముడు కార్తీక్ (19), బంధువు వెంకటేష్ (19) ఆదివారం గండిపేట్ జలాశయం బ్యాక్ వాటర్‌లో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు. ముగ్గురిలో ఒకరు నీట మునిగి పోతుంటే కాపాడే క్రమంలో ముగ్గురు మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

