ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ మోస్ట్ వాంటెడ్ మడావి హిడ్మా అతడి భార్య రాజే అలియాస్ రాజక్క అంత్యక్రియలు గురువారం సాయంత్రం హిడ్మా స్వగ్రామమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామంలో ముగిశాయి.
హిడ్మా దంపతుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రజా సంఘాల నాయకులు, జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో పువ్వర్తి గ్రామం జన సంద్రంగా మారింది. కీకారణ్యంలో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. మరోవైపు పువ్వర్తి గ్రామం కన్నీటి సంద్రంగా మారింది.

