భారతీయ చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో తన గళంతో అద్భుతాలు సృష్టించిన దిగ్గజ గాయని ఆశా భోస్లే (92) ఇకలేరు. గత కొన్ని రోజులుగా గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆమెను కుటుంబసభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు ఆమె కుమారుడు ఆనంద్ ఆదివారం వెల్లడించారు. ఆమె మరణవార్త తెలియగానే యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

