తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయాలు హీటెక్కాయి. వివిధ రాజకీయ పార్టీలు, నేతల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారం నిర్వహిస్తున్న నేతలపై ఎన్నికల అధికారుల నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఈరోజు మంగళవారం (మార్చి 31) తంజావూరు సమీపంలో డీఎంకే నాయకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కారును ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. సీఎం స్టాలిన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.

