తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌పై తమిళగగ వెట్రి కళగం (TVK) చీఫ్ విజయ్ విమర్శల దాడి పెంచారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని విజయ్ ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామని ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు ముఖ్యమంత్రికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఇప్పుడెన్ని ఆస్తులున్నాయో వెల్లడించాలని సవాలు చేశారు. వేలూరులో సోమవారంనాడు నిర్వహించిన బహిరంగ సభలో విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

