
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్‌మోర్‌లు మార్చి 20న భూమికి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లో.. భూవాతావరణానికి సర్దుబాటు చేసుకునేలా నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.తాజాగా, ఈ వ్యోమగాములు 12 రోజుల అనంతరం మొదటిసారి బ్యాహ ప్రపంచం ముందుకు వచ్చారు. సునీతా విలియమ్స్ మాట్లాడుతూ.. తనకు ఇప్పుడు బాగానే ఉందన్నారు. తమను సురక్షితంగా భూమికి తీసుకొచ్చేందుకు సహకరించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌లకు ధన్యవాదాలు తెెలిపారు.