
పహల్గాంలో టెర్రరిస్టులు దాడి చేసిన సంఘటనలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి సమయం తీసుకున్నదే తప్ప మన భారతదేశ మీడియాకు మాత్రం అంత ఓపిక లేదు. సంఘటన జరిగిన మరునాటి నుండే మన మీడియా.. ముఖ్యంగా 24 గంటల వార్తా ప్రసారాలు చేసే న్యూస్ ఛానళ్లు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించేసాయి. ‘ఇంకా ఆలస్యం దేనికి? యుద్ధం మొదలు పెట్టండి’ అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని గదమాయిస్తున్న, సలహాలిస్తున్న ప్రసారాలు అనేకం మనకి ఈ పక్షం రోజుల్లో కనిపించాయి, వినిపించాయి.’