
తనను వేశ్యలా చూస్తున్నారంటూ మిల్లా మ్యాగీ చేసిన సంచలన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మా తెలంగాణ రాష్ట్రంలో మీరు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు మేం చింతిస్తున్నాం అన్నారు.
వాస్తవానికి తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి. మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని’ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.