జమ్ము కశ్మీర్లో ప్రమాదం జరిగింది. రాజౌరి జిల్లాలో ఓ మినీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 30 మందిదాకా గాయపడ్డారు. బస్సు రాజౌరి పట్టణానికి వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో థాండికాస్సి సమీపంలో హైవేపైకి రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ఘటనలో 28 మంది గాయపడ్డారు. అందులో 26 మంది విద్యార్థులేనని అధికారులు తెలిపారు.

