తమ వద్ద ఆత్మాహుతి బోట్స్ ఉన్నాయని ఇరాన్ సైనిక దళం తాజాగా హెచ్చరించింది. భూగర్భ సొరంగాల్లో దాచి ఉంచిన రకరకాల డ్రోన్స్, నౌకలను ధ్వంసం చేయగలిగిన మిసైల్స్, నీళ్లల్లో అమర్చే మైన్స్ వంటివి ఉన్న వీడియోను అక్కడి మీడియా విడుదల చేసింది. అయితే, ఈ ఫుటేజీ ఎప్పటిదనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. పర్షియన్ గల్ఫ్‌లో చమురు రవాణా నౌకలపై దాడుల కోసం ఈ పడవలనే వాడినట్టు తెలుస్తోంది.

