పల్నాడు జిల్లా మాచర్లలో మ జంటల వీడియోల ఏఎస్సై కేసులో ఏఎస్సై కుమార్తె నందినిని కొందరు ట్రోల్ చేస్తున్నారు. పార్కుల్లో ప్రేమ జంటలు ఏకాంతంగా ఉన్న వీడియోలను డ్రోన్లతో చిత్రీకరించి.. ఏఎస్సై అయిన తన తండ్రికి తాను చేరవేసినట్లు వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. డ్రోన్‌తో ప్రేమ జంటల వీడియోలు తీసి తన తండ్రికి ఇచ్చినట్లు ప్రూఫ్స్ ఉన్నాయా?.. ఒకవేళ ఉంటే అవి తీసుకొని తన దగ్గరకు రావాలన్నారు. తన పెళ్లికి సంబంధించిన వివాదాలు కూడా తన వ్యక్తిగతమని.. అవన్నీ వాళ్లకు ఎందుకంటూ ప్రశ్నించారు.

