
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. మావోయిస్టుల ఉనికి గురించి సమాచారం నేపథ్యంలో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయని బస్తర్ రేంజ్ ఐడీ సుందర్రాజ్ పీ తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి ఇప్పటి వరకు నలుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంకా కాల్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.