సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మ్యూస్ స్పార్క్ పేరుతో ఓ కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను ఆవిష్కరించింది. ఇప్పటివరకు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అందుబాటులో ఉన్న మెటా ఏఐ కొన్ని విభాగాల్లో వెనుకంజలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్న విషయం తెలిసిందే. ఈ వేగాన్ని అందుకునే క్రమంలో రైటింగ్, రీజనింగ్ సామర్థ్యాలలో మ్యూస్ స్పార్క్ మెరుగైన ఫలితాలను చూపింది. ఈ మ్యూస్ స్పార్క్.. గూగుల్, OpenAI వంటి దిగ్గజ సంస్థలకు గట్టి పోటీ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి.

