అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో మూడు రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్ చివరకు భారీ ఎన్కౌంటర్తో ముగిసింది. బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందడంతో కలకలం రేపింది.మావోయిస్టు అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి హతమై ఉంటాడన్న అనుమానం. అయితే అతను ఎన్కౌంటర్లో మృతులలో ఉన్నాడా..? లేక పోలీసులు అదుపులో ఉన్నాడా..? అన్న అనుమానాలు మరింత మిస్టరీగా మారాయి. గతంలో కూడా దేవ్జీ పోలీసుల కస్టడీలోనే ఉన్నాడన్న ప్రచారం రావడంతో పరిస్థితి ఇంకా క్లిష్టమైంది.

