
ముందుగా ఓ మూడు నిముషాలు మెల్లగా నడవాలి. అదే సమయంలో కండరాలన్నీ కదిలేలా చూసుకోవాలి. మూడు నిముషాలు పూర్తయ్యాక వెంటనే వేగాన్ని పెంచాలి. అంటే వేగంగా నడవాలి. దాదాపు మూడు నిముషాల పాటు ఇలా చేయాలి.
ఆ తరవాత మళ్లీ మూడు నిముషాలు నెమ్మదిగా నడవాలి. ఇలా ఓ అరగంట పాటు చేస్తే చాలు. మామూలు వాకింగ్ తో వచ్చే ఆరోగ్యం కన్నా రెట్టింపు ప్రయోజనాలుంటాయని హెల్త్ ఎక్స్ పర్ట్ కశ్ ఖాన్ అంటున్నారు.