ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలో సైనికులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఒక అమర జవాను కుమార్తెకు పెళ్లి చేశారు. వారే స్వయంగా కన్యాదానం చేశారు. సైనికులంతా కలిసి ఆ పెళ్లి వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిచారు. తోటి జవాన్ అమరుడైతే ఆ కుటుంబాన్ని కొండంత అండగా నిలవడంతోపాటు అతడి కూతురుకు పెళ్లి చేసి రూ.6 లక్షలకు పైగా కట్నకానుకలు ఇచ్చి నవ వధువును అత్తారింటికి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

