తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2026 నివేదిక ప్రకారం, రాష్ట్రం మాతాశిశు ఆరోగ్య సూచికల్లో విప్లవాత్మక మార్పులు సాధించింది. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష జననాలకు 88 మాతృ మరణాలు సంభవిస్తుండగా, తెలంగాణలో ఆ సంఖ్య కేవలం 43కి తగ్గింది. అలాగే, శిశు మరణాల రేటు జాతీయ సగటు 25తో పోలిస్తే రాష్ట్రంలో 18కి పడిపోయింది. ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన ఉచిత వైద్యం అందించడం వల్ల మరణాల రేటును గణనీయంగా తగ్గించగలిగారు.

